జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక అప్డేట్ ఇచ్చింది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.3,000గా ఉన్న ఈ పాస్ ధరను రూ.75 పెంచి రూ.3,075గా నిర్ణయించింది. ఈ కొత్త ధరలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గడువు ముగిశాక మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి.