కడప: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర నగరంలోని 34, 35వ డివిజన్లలో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల మస్టర్ అటెండెన్స్‌ను తనిఖీ చేసి సమయానికి విధులకు హాజరు కావాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు.