TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఉదయం 11:45కు సభ ప్రారంభం అవుతుంది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం సభ వాయిదా వేస్తారు. అయితే, పలు అంశాలను సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ధర్నాలు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.