GNTR: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన 6.8 ఎకరాల ప్రాంగణంలో అభివృద్ధి చేసిన ‘అమరజీవి స్మృతివనం’ను కూడా ప్రారంభించారు. తెలుగు జాతి కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.