సత్యసాయి: కదిరి నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మెగా అంజాద్పై నమోదైన అక్రమ కేసుల అంశాన్ని నియోజకవర్గ సమన్వయకర్త BS మక్బూల్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లిలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తాజా పరిస్థితులను వివరించారు. అంజాద్ కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.