KDP: పాలూరు బైపాస్ రోడ్డులో ఎస్ఐ సుబ్బారావు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆరు మోటార్ సైకిళ్లతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యాడికి మండలానికి చెందిన సారావు భాస్కరాచారి అని, ఇతను బైక్‌తో పాటు ఆలయ హుండీల దొంగతనాలకు పాల్పడేవాడని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.