కోనసీమ: కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి సమగ్ర కౌలు రైతు చట్టం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని కోరుతూ రైతులతో కలిసి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు.