NGKL: జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే శ్రీపురం చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎటు నుంచి వస్తున్నాయో తెలియక అయోమయంగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్ లైట్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.