AP: అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా దీనికి నామకరణం చేశారు.