TPT: కోటలోని కార్ల స్టాండ్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు విశ్వనాథం నాగరాజు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.