SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని వైన్స్ వద్ద బహిరంగ ప్రదేశంలో కూర్చొని మద్యం సేవిస్తున్న మందుబాబులను ఎస్సై నారాయణ ఆదివారం పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశంలో కూర్చొని మద్యం సేవించడం నేరమని, వైన్స్ పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించకుండా చూడాల్సిన బాధ్యత వైన్స్ యాజమాన్యానిదేనన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SI హెచ్చరించారు.