WGL: మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా దళిత సేవలో విశేష కృషి చేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ అధ్యక్షుడు తుళ్ళ రవికి దళిత రత్న అవార్డు లభించింది. ఈ సందర్భంగా తుళ్ళ రవి ఇవాళ MLA నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి అవార్డును వారి చేతుల మీదుగా స్వీకరించారు. దళితుల అభివృద్ధి కోసం తుళ్ళ రవి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.