AP: రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. AGICL ఎండీ శ్రీనివాస్, ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో జరుగుతున్న ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే ఈ నెలలోనే పలు భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడం, నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌళిక సదుపాయాల కల్పనపైనా చర్చ జరగనుంది.