బంగారం ధరతో పాటు వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ఏకంగా రూ.10,000 ఎగబాకింది. దీంతో ప్రస్తుతం సిల్వర్ రేటు రూ.2,65,000కు చేరింది. కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 పెరగగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,650 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.