బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తన లక్కీఛార్మ్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెప్పింది. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. తన కెరీర్ మొదట్లో రణ్వీర్తో కలిసి చేసిన యాడ్‌ను చూసి దర్శకులు తనకు సినీ అవకాశాలు ఇచ్చారని పేర్కొంది. అందుకే తన కెరీర్ క్రెడిట్ ఆయనకే ఇస్తానని తెలిపింది. రణ్వీర్ ఎన్నోసార్లు సాయం చేశాడని చెప్పింది.