NLG: కంబాలపల్లిలో నేడు భూ సర్వే నిర్వహించనున్నారు. పుచ్చకాయల మోటో, పోలగానికుంట ప్రాంతాల్లో ఈ సర్వే జరుగుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్‌తో హాజరై అధికారులకు సహకరించాలని కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.