చమురు ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని IMF మాజీ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ హెచ్చరించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 60 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని, వృద్ధి రేటులో 0.4% తగ్గుదల ఉండవచ్చని అంచనా వేశారు. ఇరాన్ యుద్ధం వేళ ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక మందగమనానికి దారితీస్తాయని ఆమె విశ్లేషించారు.