VSP: కంచరపాలెంలో గల బర్మా క్యాంప్ నూకాంబిక అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 8వ రోజు సోమవారం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి నేరుగా వారి స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి, దీప, దూప సేవ నిర్వహించారు.