WG: గొల్లల కోడేరు జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గతంలో రోడ్డు పనుల వల్ల భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగేదని, పనులు పూర్తి కావడంతో తిరిగి SP కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ మార్పును గమనించాలని కోరారు