GDWL: అయిజ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ ఎస్. మద్దిలేటిని ఆయన చిన్ననాటి మిత్రులు సన్మానించారు. 1996 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు గద్వాల్ రోడ్డులోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.