SKLM: టెక్కలి మండలం తిర్లంగికి చెందిన ఎస్. రాములు అనే వృద్ధుడు ట్రాక్టర్ ఢీకొనడంతో ఆదివారం మృతి చెందాడు. స్థానిక సాగునీటి కాలువ వద్ద స్నానం చేసి వెళ్తుండగా అక్కవరం వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన రాముల ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.