TPT: ఏడుకొండలవాడా.. వెంకటరమణ నీవే మా దిక్కు అంటూ స్విమ్స్ కార్మికుల చెవిలో పువ్వు, పంగనామాలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్ల సాధన కోసం చేపట్టిన పోరాటం 16వ రోజుకు చేరుకుంది. యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలని CITU నాయకుడు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.