NGKL: జిల్లాలోని వనపట్ల గ్రామ గేట్ వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న బైక్ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.