TPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “దివ్యాంగ శక్తి” ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. దివ్యాంగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్టాండ్లలో ప్రత్యేక ర్యాంపులు, బస్సు పాస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్సుల్లో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని తెలిపారు.