WGL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండలంలోని ధర్మారం గ్రామంలో గల పెద్దమ్మతల్లి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనిషా- శివకుమార్ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.