KDP: మైలవరం మండలం తొర్రివేముల గ్రామానికి చెందిన సుబ్బయ్యను జిల్లా బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. జిల్లాలో వైసీపీని బలోపేతం చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని సుబ్బయ్య అన్నారు. తనకు సహకరించిన ఎంపీ అవినాష్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.