ATP: జిల్లాలో రేపటి నుంచి 31,972 మంది పదో తరగతి విద్యార్థులు 143 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.ప్రసాద్ బాబు తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని, విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 7799465363 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.