AP: డ్రగ్స్ వ్యవహారంపై ఎంపీ పుట్టా మహేష్ స్పందించారు. ‘నేను తప్పు చేయలేదు, నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. స్నేహితుడిని కలవడానికి మొయినాబాద్ వెళ్లా. పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తా. నిజం గెలుస్తుంది, ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని పేర్కొన్నారు.