రాజకీయాల్లో ఉన్నప్పటికీ తనలోంచి సినిమాను వేరు చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. అది తన నరనరాన జీర్ణించుకుపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, సమాజంలో సినిమా లేకపోతే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ ప్రేక్షకులను, ముఖ్యంగా తెలుగు ప్రజలను సినిమా నుంచి విడదీయడం అసాధ్యమని స్పష్టం చేశారు.