మనం డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు డాక్టర్లు నాలుకని చూపించమంటారు. ఎందుకంటే అది మన ఆరోగ్యపరిస్థితిని సూచిస్తుంది. శరీరం డీహైడ్రేట్గా ఉంటే నాలుక పొడిగా మారుతుంది. అనీమియా సమస్య ఉంటే రక్తహీనతను సూచిస్తుంది. ఇన్ఫెక్షన్లు ఉంటే నాలుకపై తెల్లని పొరలు ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్య ఉంటే నాలుక పెద్దదిగా మారుతుంది. కిడ్నీ, లివర్ సమస్యలుంటే రంగుమారుతూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.