ప్రకాశం: హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీట్ హోల్డర్లకు ఆదివారం ఎస్సై మాధవరావు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా మంచి ప్రవర్తనతో ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.