MDK: మహాత్మ జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలకు మెదక్ జిల్లా రామాయంపేట సిద్ధమైంది. ఈ సందర్భంగా రామాయంపేట పట్టణంలో ఆయన విగ్రహాన్ని ముస్తాబు చేశారు. విగ్రహాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏర్పాట్లుపూర్తి చేశారు. నేడు జాల్లాలో ఘన నివాళులు, భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది.