JN: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తరణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, తదితర అంశాలపై కాసేపు రాజ్యసభ సభ్యులతో ఛైర్మన్ రాఘవరెడ్డి క్షుణ్ణంగా చర్చించారు. రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.