సినీ నిర్మాత సునీల్ నారంగ్‌కు ఆయన అకౌంటెంట్ భారీ టోకరా వేశాడు. బోగస్ ఖాతాల పేరుతో నిర్మాత వద్ద నుంచి ఏకంగా కోటి రూపాయలు కాజేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన నిర్మాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు విశ్వనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.