హన్మకొండ నగరంలో శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్‌ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు విచ్చేసిన న్యాయమూర్తిని ఎన్ఐటీ అతిథి గృహంలో కలెక్టర్ కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై కలెక్టర్, జస్టిస్ వేణుగోపాల్ మధ్య చర్చ జరిగింది.