‘కాంతార’ భూత కోల వేషధారణపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ వెనక్కి తగ్గాడు. కర్ణాటక హైకోర్టులో జరిగిన విచారణలో, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తానని హామీ ఇచ్చాడు. తన సింధీ నేపథ్యం వల్ల ఈ సంప్రదాయాల విశిష్టత తెలియక పొరపాటు జరిగిందని, ఇది ఉద్దేశపూర్వకం కాదని తెలిపాడు. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.