కృష్ణా: రంజాన్ మత సామరస్యానికి ప్రతీక అని విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం బాపులపాడు(మం) బొమ్ములూరులోని తన INC 1947 లెదర్ ఇండస్ట్రీలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అతిథులకు స్వయంగా హలీమ్, అల్పాహారం అందించారు. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ గొప్పతనం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.