GNTR: సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని బలపరిచే శక్తివంతమైన సాధనమని రాష్ట్ర సమాచార కమిషనర్ పీ. సింహాచలం నాయుడు అన్నారు. ఆదివారం వడ్లమూడిలో జరిగిన ‘‘20 ఏళ్ల ఆర్టీఐ – గుడ్ గవర్నెన్స్’’ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ చట్టం పాలనలో పారదర్శకతను తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.