తన వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫంక్షన్కు చిరంజీవిని పిలుద్దామని హరీష్ శంకర్ కోరగా.. ‘మీకు హీరో కావాలంటే నన్ను పిలవండి, తమ్ముడు కావాలంటే అన్నయ్యను పిలవండి’ అని చెప్పినట్లు పవన్ పేర్కొన్నారు. చిరంజీవి పక్కన ఉంటే తాను హీరో అన్న విషయం మర్చిపోతానని, ఏం మాట్లాడాలో కూడా తోచదని వ్యాఖ్యానించారు.