భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది. రైలు బయలుదేరే సమయం ఆధారంగా టికెట్ మొత్తం రిఫండ్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం 72 గంటల ముందు ఎవరైనా కన్ఫామ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం రిఫండ్ చేసేలా మార్పులు చేసింది. ప్రయాణానికి 8 గంటల ముందు గానీ, రైలు బయలుదేరిన తర్వాత టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ ఉండదు.