KMM: కొత్తగూడెం కార్పొరేషన్ 47, 54 డివిజన్లలో గెలిచిన ఇద్దరు కార్పొరేటర్ల ఎన్నికలపై జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అఫిడవిట్ లోపాలు ఉన్నాయని పేర్కొంటూ వారి ఎన్నికలను రద్దు చేయాలని ప్రత్యర్థులు కోరారు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.