TG: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ ప్రతి గ్రామంలో నిరసనలు తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతోందని ఆయన విమర్శించారు. గాంధీ, నెహ్రూల పేర్లను చరిత్ర నుంచి తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.