KRNL: మహిళలను అక్షరాస్యులను చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్షరాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. 42 వార్డుల్లో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ సుమారు 8,000 మంది మహిళలు తుది పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలను పురపాలక కమిషనర్ మొహమ్మద్ పరిశీలించారు.