PPM: జిల్లా వ్యాప్తంగా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాథమిక అక్షరాస్యతా పరీక్ష విజయవంతంగా జరిగింది. మొత్తం 1,417 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు గుర్తించిన 67,686 మందికి గాను, 66,467 మంది హాజరయ్యారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం అంశాలపై పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.