ELR: కైకలూరు మండలం కొల్లేటికోటలో వేంచేసియున్న శ్రీ పెద్దింట్లమ్మ ఆలయం ఆదివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి మొక్కలు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే అమ్మవారికి వివిధ రూపాలలో రూ.2,12,840 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి తెలిపారు.