హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఈత’. ప్రఖ్యాత తమాషా కళాకారిణి వితాబాయి నారాయణంగావ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ మూవీ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.