అన్నమయ్య: రాయచోటి పట్టణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి NMD ఫారూఖ్ హాజరై ఉపవాస విరమణ చేశారు. వేలాది మంది ముస్లింలతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని మంత్రులు తెలిపారు.