TG: గ్రామాలలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం, బాలరాజ్ పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. వారికి ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు అందజేశారు.