KDP: డిగ్రీ విద్యార్థి అదృశ్యమైన ఘటన వేంపల్లెలో చోటు చేసుకుంది. స్థానిక బలిజ సంఘం వీధికి చెందిన శ్రీనివాసులు, హేమలత దంపతుల కుమారుడు వెంకట పూజిత్ అదృశ్యమైనట్లు వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు కళాశాలకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటికి రాలేదన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.