ఉదయం పరగడుపునే 1 లీటర్ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలి. గోరు వెచ్చటి నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. పేగులు శుభ్రంగా మారతాయి. అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలి. వ్యాయామానికి ముందు గ్లాసు నీరు తీసుకోవాలి. నిద్ర పోయేముందు ఓ గ్లాసు నీరు తాగాలి.